ఐదు సంవత్సరాల సాధన - 703వ ర్యాంకుతో ఆదిలాబాద్ యువకుడి విజయం - 703 Ranker Rajkumar Interview - 703 RANKER RAJKUMAR INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Apr 19, 2024, 3:43 PM IST
703 UPSC Ranker Rajkumar Interview : వరంగల్ ఎన్ఐటీలో బీటెక్, ఆ తర్వాత పెద్ద కంపెనీలు ఉద్యోగం అనుకున్నాడా యువకుడు. కానీ, తన మనసు యూపీఎస్సీ మీదకి మళ్లీంది. మెుదటి మూడు ప్రయత్నాల్లో మెయిన్స్ కూడా దాటలేదు. అయినా ఎక్కడ నిరుత్సాహ పడకుండా దాదాపు 5 సంవత్సరాలు నిరంతర సాధన చేశాడు. 4వ ప్రయత్నంలో 703వ ర్యాంకుతో విజయం సాధించాడు. తనే ఆదిలాబాద్ యువకుడు రాజ్‌కుమార్.
కుటుంబ ప్రోత్సాహం ఉందని, తనకు ఈ ర్యాంకు రావడంతో తన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారని రాజ్‌కుమార్ తెలిపారు. తండ్రి ప్రభుత్వ టీచర్, తల్లి గృహిణి అని చెప్పారు. బీటెక్ చదువుతున్నప్పుడే సివిల్స్ వైపు వెళ్లి సామాజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అనంతరం సివిల్స్‌కు సన్నద్ధమయ్యానని చెప్పారు. అనుకున్న గమ్యం చేరాలని, దేనిలోనైనా సరే నమ్మకంతో ప్రయత్నించాలని యువతకు సూచించారు. మరీ గత ఐదేళ్లలో సివిల్స్ సాధించడానికి ఆయన ఎదుర్కొన్న సవాళ్లేంటో తననే అడిగి తెలుసుకుందాం.