కడప, అనంతలో జోరు వాన - కూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు - Rain in AP - RAIN IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 9:12 AM IST
Rain in YSR District : అల్పపీడన ప్రభావంతో కడపలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనాదారులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల కాలువలు, డైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. వృక్షాలు సైతం నేలకొరిగాయి.
Rain in Anantapur District : అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిందూపురం, శింగనమల, తలుపుల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. గాలి వానకు చెట్లు విరిగిపడటంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.