కేసీఆర్​కు మెదక్ ఎంపీ స్థానం​ కోసం స్థానిక అభ్యర్థి దొరకలేదా?- రఘునందన్​ రావు - Raghu Nandan Rao Fires On Kcr - RAGHU NANDAN RAO FIRES ON KCR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 9:35 PM IST

Raghu Nandan Rao Fires On Kcr : తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన మెదక్​ గడ్డపై పుట్టిన వారికి బీఫామ్​ ఇచ్చేందుకు కేసీఆర్​కు ఒక్క అభ్యర్థి కూడా దొరకలేదా అని రఘునందన్ ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని శివనుభవా మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్​రావు మాట్లాడారు. మెదక్​ పార్లమెంట్​ అభ్యర్థిగా పోటీచేసేందుకు పక్క జిల్లాల నుంచి అభ్యర్థులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి బీఆర్​ఎస్​కు ఏర్పడిందని ఆయన విమర్శించారు. 13 ఏళ్ల మీ పోరాటం, పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేసీఆర్​ను ప్రశ్నించారు.  

తెలంగాణ ఉద్యమం స్థానికులకు, స్థానికేతరులకు మధ్య జరిగిన పోరాటమైతే ఇవాళ మెదక్​ ప్రజలకు కేసీఆర్​ సమాధానం చెప్పాలని రఘనందన్​ రావు ప్రశ్నించారు. మీ కోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప రెడ్డి ఎక్కడున్నారు?. జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిన భూం రెడ్డి ఎక్కడున్నారు. ఈ జిల్లాలో పుట్టిన వారికి ఎవ్వరికీ టికెట్​ ఇవ్వడానికి మీకు మనసు రాలేదా అని రఘునందన్​ రావు ప్రశ్నించారు. బీఆర్​ఎస్ పార్టీకి చేతనైతే నిజమైన తెలంగాణ ఉద్యమ కారులకు టిక్కెట్​ ఇవ్వాలన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.