లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు - విధుల్లో 6వేల మంది సిబ్బంది : సీపీ తరుణ్‌జోషి - Rachakonda CP Interview - RACHAKONDA CP INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 11:04 AM IST
|Updated : May 7, 2024, 12:45 PM IST
Rachakonda CP Tarun Joshi Interview On Election : మరో ఐదురోజుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి తెలిపారు. పోలీసులు, కేంద్రబలగాలు కలిపి 6 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో పాల్గొంటాయని వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయని, ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ వేసేలా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
CP Tarun Joshi Interview : రాచకొండ పరిధిలో మొత్తం 1590 ప్రాంతాల్లో 3,396 పోలింగ్ కేంద్రాలున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. 533 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని వెల్లడించారు. ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల విధులపై అన్ని ర్యాంకుల అధికారులకు కలిపి 20 శిక్షణ సదస్సులు నిర్వహించామని వివరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!