జంగిల్ క్లియరెన్స్ పనుల్లో భారీ కొండచిలువ కలకలం - Python in Jungle Clearance Work - PYTHON IN JUNGLE CLEARANCE WORK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 11:51 AM IST
Python in Jungle Clearance Work at Amaravati : రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్న ప్రాంతంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. 16 అడుగుల పామును చూసి అందరూ ఉలికిపాటుకి గురయ్యారు. విటు విశ్వవిద్యాలయం ఎదురుగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న సమయంలో కొండచిలువ బయటకు వచ్చింది. పొక్లెయిన్ పైకి ఎక్కుతుండగా అప్రమత్తమైన డ్రైవర్ దానిని కింద పడేలా చేశార. తర్వాత పామును చంపారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న సమయంలో భారీగా నాగుపాములు, విషపాములు బయటికి వస్తున్నాయని గుత్తేదారు చెప్పారు. పొక్లైన్ డ్రైవర్లకు పొడవాటి షూస్, యాంటీ వెనం ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు.
విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలను నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ప్రాంతాన్ని పట్టిన నాటి పీడ, అది వదిలి వెళ్లిన చీడను ప్రక్షాళన చేసి నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించేందుకు ముందుకు కదలుతోంది కూటమి ప్రభుత్వం. ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని, కక్ష సాధింపులకు నిదర్శనంగా రాజధాని ప్రాంతమంతా మొలిచిన ముళ్లచెట్లు, పొదలు తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.