తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన కొండచిలువ - python at tirumala hills
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 3:50 PM IST
Python at Tirumala Hills : తిరుమలలో ఓ భారీ కొండచిలువ భక్తులను పరుగులు పెట్టించింది. స్థానిక వరాహస్వామి అతిథిగృహాలకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ సముదాయాల వద్ద కొండచిలువ సంచరిస్తోంది. ఈ భారీ కొండచిలువను చూసిన భక్తులు, శ్రీవారి సేవకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయడు అక్కడికి చేరుకొనే సరికి అది మట్టిలో తలదాచుకుంది. చాకచక్యంగా మట్టిని తవ్వి కొండచిలువను బయటికి తీశారు. ఈ కొండచిలువ దాదాపుగా 12 అడుగు పొడవు ఉందని తెలిపారు. అనంతరం కొండచిలువను దూరంగా అడవుల్లో వదిలి పెట్టడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే తిరుమల క్షేత్రానికి వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో ఇటీవల క్రూరమృగాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులపై చిరుతలు, ఎలుగుబంట్లు దాడులు చేయడంతో అధికారులు తగుచర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాతో చిరుతలను బంధించి వాటిని అటవీప్రాంతానికి తరలిస్తున్నారు. వీటితో పాటు తిరుమలలో కొండచిలువలు కూడా భక్తలను, శ్రీవారి సేవకులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.