LIVE : పూరీ జగన్నాథుని బహుడా రథయాత్ర - ప్రత్యక్షప్రసారం - Puri Jagannath Bahuda Yatra Live - PURI JAGANNATH BAHUDA YATRA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 11:31 AM IST
|Updated : Jul 15, 2024, 4:44 PM IST
Puri Jagannath Bahuda Yatra Live : ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని లీలలు పెంచిన తల్లి సన్నిధిలో ఆదివారంతో ముగిశాయి. నేడు బలభద్ర, సుభద్ర, సుదర్శనులతో కలిసి స్వామి శ్రీక్షేత్రానికి నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై వెళ్తున్నారు. ఈ వేడుకను బహుడా యాత్రగా పేర్కొంటారు. తిరుగు యాత్రలో ఎన్నో వేడుకలుంటాయి. మార్గమధ్యంలో కుమారుని కోసం ఏడాది కాలం వేచి చూసే మవుసిమా పుడోపిఠా చేసి సిద్ధంగా ఉంచుతుంది. బహుడా యాత్రగా వచ్చే పురుషోత్తముని రథం బొడొదండొ మార్గంలో మవుసిమా ఆలయం వద్ద ఆగింది. గోధుమ రవ్వ, జున్ను, కొబ్బరి, పంచదార తదితరాలతో తయారైన పుడోపిఠాను ఆనవాయితీ ప్రకారం రథంపై జగన్నాథునికి అర్పించారు. తరువాత రథం కదిలింది. మరోవైపు గుండిచా పొహండినాడు జరిగిన అపశ్రుతిని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిర్ణీత వేళల్లో స్వామి సేవలు జరిగేలా సన్నాహాలు జరిగాయి. సేవాయత్‌లకు ఈ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రథయాత్ర మాదిరిగా బహుడా వేడుకకు పూరీలో మూడంచెల భద్రత కల్పించారు, తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక బలగాలను నియమించారు. దాదాపు 82 ప్లటూన్ల పోలీసు బలగాలను నియమించింది.
Last Updated : Jul 15, 2024, 4:44 PM IST