కడుపు మండిపోతోంది- మళ్లీ ఓట్లు అడగటానికి ఎలా వచ్చావ్! ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ - PROTEST TO YSRCP MLC ANANTHA BABU - PROTEST TO YSRCP MLC ANANTHA BABU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 9:38 PM IST
PROTEST TO YSRCP MLC ANANTHA BABU: అల్లూరి జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అడుగుడుగునా నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తమ గ్రామాల్లోకి అనంతబాబు అడుగుపెట్టొద్దంటూ యువత హెచ్చరిస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలవరం మూలపాడు నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం మూలపాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లైనా తమకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఓట్ల కోసం తప్ప మిగిలిన సమయాల్లో మేం గుర్తుకు రామా అంటూ ప్రశ్నించారు.
కడుపు మండిపోయి ఉన్నాం ఇక్కడ, నాలుగేళ్లయింది ఇప్పుడు గుర్తుకొచ్చామా అంటూ మండిపడ్డారు. ఓ నిర్వాసితుడిని ఓవర్ వద్దు అంటూ ఎమ్మెల్సీ అన్నారు. దీంతో ఆ వ్యక్తి ఓవర్ కాదండీ మా సమస్యలను పట్టించుకోలేదని చెబుతున్నామంటూ సమాధానం ఇచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు మాకొద్దంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతబాబును నిలదీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.