పోర్టు స్టేడియంలో క్రికెట్ ఆడితే డబ్బు చెల్లించాలా! ప్రైవేటీకరణను ఆపాలంటున్న ప్రజాసంఘాలు - Vizag Port Stadium news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 4:02 PM IST

Privatisation Of Vizag Port Stadium :  విశాఖ పోర్టు స్టేడియం, పోర్టు ట్రస్టు నిర్వహణలోనే  ఉండాలని విశాఖపట్నంలోని ప్రజాసంఘాలు, రెసిడెన్షియల్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. పోర్టు స్టేడియంను ప్రైవేటీకరించారదంటూ వార్వా, నీవాస్ అసోసియేషన్ సభ్యులు పోర్టు స్టేడియం వద్ద ఆందోళనలకు దిగారు. నిత్యం ఎంతో మంది ఉపయోగించుకునే ఈ స్టేడియాన్ని ఎలా ప్రైవేటుపరం చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అపార్ట్మెంట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ( వార్వా), గ్రేటర్ విశాఖ రెసిడెంట్ కాలనీ అసోసియేషన్స్ ఫెడరేషన్ ( నీవాస్) సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖ పోర్టు ఆస్తిగా ఉన్న స్టేడియాన్ని ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇది విశ్వనాధ్ స్టేడియంగా, విశ్వనాధ్ కన్వెన్షన్స్​గా మారిపోయిందని మండిపడ్డారు. 

అనంతరం వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ స్టేడియంలో ఒకరోజు క్రికెట్ ఆడుకోవాలన్న 36 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఇవి కాక ఆదరణపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఉదయం, సాయంత్రం నగరవాసులు వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే వారని ఇకపై ఆ అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ స్టేడియంను పోర్టు యాజమాన్యం అధీనంలోనే ఉంచాలని, ప్రైవేట్ పరం చేయరాదని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.