సమస్యలు పరిష్కరించే ప్రభుత్వానికే మద్దతు- విద్యాసంస్థల జేఏసీ ఛైర్మన్ - Icasa Chairman on ysrcp - ICASA CHAIRMAN ON YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 1:57 PM IST
Private Educational Institutions Icasa Chairman Fired on Ysrcp: ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వైఎస్సార్సీపీ చీడపురుగులా చూస్తూ సమస్యలు పట్టించుకోలేదని రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఛైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి మండిపడ్డారు. డీఎడ్ కళాశాలల అనుమతిని వైఎస్సార్సీపీ రద్దు చేయటంతో ప్రైవేటు విద్యాసంస్థల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని జోగి రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 14న కడపలో ఉమ్మడి కడప జిల్లాల ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటిని మేల్కొల్పి తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వమైతే తమ సమస్యలు పరిష్కరిస్తుందో రానున్న ఎన్నికల్లో వారికే మద్దతు ప్రకటిస్తామని జోగి రామిరెడ్డి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ (Reimbursement), అమ్మ ఒడి పథకాల డబ్బులు పాఠశాలల యాజమాన్యాల ఖాతాలో వేయాలని జోగి రామిరెడ్డి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు 50 లక్షల ఓట్లు ఉన్నాయని, తమ శక్తి చూపిస్తామని జోగి రామిరెడ్డి పేర్కొన్నారు.