LIVE: తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - Modi Road Show in Hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 6:25 PM IST

Updated : Mar 15, 2024, 7:01 PM IST

LIVE : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజిగిరికి చేరుకుని రోడ్​ షోలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు ఈ రోడ్‌షో సాగనుంది. ఈ రోడ్​ షో అనంతరం మోదీ రాజ్‌భవన్‌ చేరుకుంటారు.శనివారం నాగర్‌కర్నూల్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ లోక్‌సభ స్థానాలు లక్ష్యంగా ఈ సభ జరగనుంది. తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు ప్రధాని వివరించనున్నారు. దేశంలో మూడోసారి బీజేపీ సర్కార్‌ రావాల్సిన ఆవశ్యకతను వివరించి మరోసారి ఆశీర్వదించమని కోరనున్నారు. అలాగే ఈ నెల 18న మోదీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా దానికి రూపకల్పన చేశారు.
Last Updated : Mar 15, 2024, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.