LIVE : టీమ్ ఇండియా క్రికెటర్లతో ప్రధాని మోదీ భేటీ - ప్రత్యక్ష ప్రసారం - Modi Interaction with Team India - MODI INTERACTION WITH TEAM INDIA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2024/640-480-21866821-thumbnail-16x9-teamindia.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 4, 2024, 1:42 PM IST
|Updated : Jul 4, 2024, 2:47 PM IST
PM Modi Interaction With Team India Today Live : టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 3రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా పీఎం నివాసానికి చేరుకున్న ప్లేయర్లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు.ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్‌లో ముంబయి వెళ్లనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబయిలో భారీ రోడ్ షో ఉండనుంది. ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Last Updated : Jul 4, 2024, 2:47 PM IST