LIVE : కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం - హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - President Murmu Telangana Tour
🎬 Watch Now: Feature Video
Published : Mar 15, 2024, 5:37 PM IST
|Updated : Mar 15, 2024, 8:05 PM IST
President Droupadi Murmu Telangana Tour Live : తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు విచ్చేశారు. నగర శివారులోని కన్హా శాంతివనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్-2024’ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గురువారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగంగా నేడు(శుక్రవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకాగా, శనివారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది రాక సందర్భంగా పోలీసులు కన్హా శాంతివనంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రెసిడెంట్ ముర్ము గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరల్డ్‌వైడ్‌గా 130 దేశాల నుంచి సుమారు 300 ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, అన్ని మతాలకు చెందిన మతపెద్దలతో పాటు లక్ష మందికి పైగా ప్రముఖులు ఈ ఫెస్టివల్‌కు హాజరుకానున్నారు. మరోవైపు రాజధానిలో ఒకే రోజు రాష్ట్రపతి, ప్రధాని పర్యటనల నేపథ్యంలో పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పరిధిలోని రోడ్‌షోలో పాల్గొంటారు.
Last Updated : Mar 15, 2024, 8:05 PM IST