ఎలక్షన్ ఫీవర్ - జోరుగా ఎన్నికల ప్రచార రథాల తయారీ - election campaign vehicles - ELECTION CAMPAIGN VEHICLES
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-04-2024/640-480-21202817-thumbnail-16x9-election-campaign.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 11, 2024, 10:32 PM IST
Election Campaign Vehicles : రాష్ట్రంలో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచార వాహనాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నోటిఫికేషన్ తేదీ సమీపిస్తుండటంతో, ప్రధాన పార్టీలన్నీ ప్రచారానికై సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు సీట్లు ఖరారైన అభ్యర్థులు, ప్రచారం కోసం ప్రత్యేక ప్రచార రథాలు సిద్ధం చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ని ఎన్టీఆర్ మార్క్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఈ ప్రచార రథాలను తయారు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ, నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో కొంచెం తక్కువగానే ఆర్డర్లు వస్తున్నాయని ప్రచార రథాల తయారీదారులు అంటున్నారు. అధికార పార్టీ నుంచే అధికంగా వాహనాల తయారీ ఆర్డర్లు వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నగరం చుట్టుపక్కల నుంచే కాకుండా, ఇతర జిల్లాల నుంచి కూడా పలువులు రాజకీయ నేతలు ఇక్కడికి వచ్చి తమ అభిరుచి, అవసరాలకు తగినట్లు ప్రచార వాహనాలు సిద్ధం చేసేందుకు ఆర్డర్లు ఇస్తున్నారని ప్రచార రథాల తయారీదారులు చెబుతున్నారు.