ప్రత్తిపాటి శరత్‌ బెయిల్ పిటిషన్​పై వాదనలు పూర్తి - తీర్పు రిజర్వ్​ - Prathipati Sarath bail petition

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 10:26 PM IST

Prathipati Sarath Bail Petition Hearing : పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ నేత ప్రతిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఒకటో ఏసీఎంఎం కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీ కోర్టు పీపీ బి. సత్యనారాయణ తన వాదనలు వినిపించారు. ప్రతిపాటి శరత్‌ను ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని అన్నారు. 

తీర్పు రిజర్వు - ఈ నెల 14వ తేదీ వెల్లడి? : అవెక్సా కార్పొరేషన్‌ ద్వారా పాల్పడిన అవకతవకలకు సంబంధించి లోతుగా ప్రశ్నించి వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఈ దశలో బెయిల్‌ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పీపీ వాదించారు. దర్యాప్తును విజయవాడ పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ అయిందని, ఈ దృష్ట్యా కేసు విచారణ పరిధిని సీఐడీ న్యాయస్థానానికి మార్చాలని న్యాయాధికారి ఎదుట తన వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఈ నెల 14వ తేదీ తీర్పును వెల్లడించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.