ప్రసాదం కలుషితం - 60 మందికి అస్వస్థత - ఆస్పత్రిలో ఒక్కరే నర్సు - FOOD POISON

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 12:03 PM IST

Updated : Sep 10, 2024, 1:35 PM IST

thumbnail
ప్రసాదం కలుషితం - 60 మందికి అస్వస్థత - ఆస్పత్రిలో ఒక్కరే నర్సు (ETV Bharat)

Prasadam Contaminated 60 Affected In Satya Sai District : శ్రీ సత్య సాయి జిల్లా సికేపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో కలుషిత ఆహారం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పంపిణీ చేసిన ప్రసాదం కలుషితమైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అస్వస్థకు గురైన వారిలో 40 మంది చిన్నారులు పెద్దలు సికేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

కేవలం ఒక్క నర్సు మాత్రమే వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన చిన్నారులకు సైతం పెద్దలకు ఉపయోగించే సైలెన్ పరికరాలను వినియోగించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. 24 గంటలు డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది  లేకపోవడమేంటని ధ్వజమెత్తారు. పై అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Last Updated : Sep 10, 2024, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.