LIVE: ఐమాక్స్‌ గ్రౌండ్స్‌లో సంగీత కార్యక్రమం - CM REVANTH REDDY IN TANKBUND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 7:31 PM IST

Updated : Dec 8, 2024, 9:23 PM IST

Praja Palana Vijayotsavalu Live : ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ తీరాన ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఎయిర్​ షో ఘనంగా జరిగింది. భారత వాయుసేనకు చెందిన తొమ్మిది సూర్యకిరణ్​ విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేశాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎయిర్​ షోను సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యి వీక్షించారు. రాహుల్​ సిప్లిగంజ్​ మ్యూజికల్​ కాన్సర్ట్​ జరుగుతోంది. నెక్లెస్​ రోడ్డులో ఫుడ్​, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్​, ఐస్​క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్​ స్టాళ్లు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. రాజీవ్​ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్​ స్టేడియం, ఫుడ్​ ఓవర్​ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన వేదికల వద్ద నేడు, రేపు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సోమవారం(డిసెంబర్ 09న) సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ప్రభుత్వం వసతులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Last Updated : Dec 8, 2024, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.