కల్కి ట్రైలర్ విడుదలలో ఉద్రిక్తత - పోలీసుల లాఠీఛార్జ్ - kalki trailer release - KALKI TRAILER RELEASE
🎬 Watch Now: Feature Video
Published : Jun 10, 2024, 10:37 PM IST
LOTTY CHARGE ON PRABHAS FANS : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ సినిమా థియేటర్లో కల్కి సినిమా ట్రైలర్ విడుదల చేసే సమయంలో రసాభాసా చోటుచేసుకుంది. ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం చూపడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ఎంఎం థియేటర్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటుడు ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నారు.
డప్పు వాయిద్యాలు, బానసంచా ఫ్లెక్సీలతో అభిమానులు సంబురాలు చేశారు. సినిమా ధియేటర్లో కల్కి సినిమా ట్రైలర్ విడుదల ఆలస్యం కావడంతో అభిమానుల ఆగ్రహం కేకలు వేశారు. బయట ఉన్న యువకులు సంధ్య 70 ఎంఎం థియేటర్లోకి లోపలికి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులను చెదరగొట్టడానికి చిక్కడపల్లి పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీల నుంచి తప్పించుకోవడానికి యువకులు రోడ్డుపైకి పరుగులు తీశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.