బుడ్డాయిపల్లెలో యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ విడి విక్రయాలు - బంక్ సీజ్ - Police Have Seized The Petrol Bunk - POLICE HAVE SEIZED THE PETROL BUNK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 1:29 PM IST
Police Have Seized The Petrol Bunk in Buddaipalli: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10 వరకు పెట్రోల్, డీజిల్ విడి విక్రయాలు చేపట్టరాదన్న హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే వైఎస్సార్ జిల్లా బుడ్డాయిపల్లె వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో ఈ హెచ్చరికలను బేఖాతరు చేయడంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనాల ట్యాంకుల్లో మాత్రమే నేరుగా డీజిల్, పెట్రోల్‌ను నింపాల్సి ఉండగా బాటిళ్లు, క్యాన్లలో నింపడంపై ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినా అందుకు విరుద్ధంగా డీజిల్, పెట్రోల్ విక్రయిస్తుండటంతో మేనేజర్ సమక్షంలో పెట్రోలు బంకును పోలీసులు సీజ్ చేశారు.
వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం బుడ్డాయిపల్లెలో భారత్ పెట్రోల్ బంకులో బాటిళ్లు, డబ్బాలో పెట్రోల్ కొట్టారు. కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఓ వైపు పోలీసు అధికారులు చెబుతున్నా మరోవైపు బంకుల్లో పెట్రోల్, డీజిల్ లూజు విక్రయాలు జరుపుతుండటంపై అధికారులు మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆ బంకును సీజ్ చేశారు. పెట్రోల్ బంకుల్లో లూజు విక్రయాలు చేపట్టరాదని ఇదివరకే ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు.