మద్యం తాగి డ్రైవ్​ - ఫైన్​ వేశారని బైక్​కు నిప్పు - వీడియో వైరల్ - మనస్తాపం చెంది బైక్​కు నిప్పు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 11:02 AM IST

Police Has Fined Man Disappoint To Bike Was Fire: పోలీసులు జరిమానా విధించారని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నంద్యాల ఆర్టీసి బస్టాండ్ సమీపంలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సుబ్బారాయుడు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించి తగల బెట్టాడు. నంద్యాల రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో శనివారం రాత్రి సుబ్బారాయుడు మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్ మెషిన్​లో తెలిసింది. 

దీంతో అతడికి 2500 రూపాయలు జరిమానా విధించారు. అతడు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా అతడిని ఆపి మద్యం సేవించినట్లు కనిపిస్తే చెక్​ చేశారు. పోలీసులతో అతడు మద్యం సేవించలేదని వాదించి మనస్తాపానికి గురై తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టేశాడు. పోలీసులు ఎంత చెబుతున్నా వినలేదు. మంటల్లో ద్విచక్ర వాహనం సగానికి కాలిపోయింది. రహదారిపై వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించిన అతడిని ఒకటవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.