బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - ganja chocolates case in balanagar
🎬 Watch Now: Feature Video
Published : Feb 25, 2024, 2:27 PM IST
Police Caught Man Selling Ganja Chocolates in Balanagar : హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన అనంత్ కూమార్ బరాటే (38) అనే వ్యక్తిని బాలానగర్‌లోని పారిశ్రామికవాడలోన ఘర్ ఖాంటా వద్ద చిన్న కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంలో పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. దీంతో గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. అతని షాపులో, బైక్ సీట్లో మొత్తం కలిపి 140 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అనంత్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఈ మధ్య కాలంలో గంజాయి చాక్లెట్లు అధికంగా పట్టుబడుతున్నాయి. పోలీసుల తనిఖీలు పెంచడంతో ఈ మాదిరిగా విక్రయాలు చేస్తున్నారు. ముఖ్యంగా వీటికి విద్యార్థులు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇలాంటి చర్యలు పాల్పకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సరఫరపైన ఎప్పుడు వాళ్ల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.