అనంతపురం జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్ - వారిని టార్గెట్ చేసే విక్రయాలు! - police arrested ganja selling gang - POLICE ARRESTED GANJA SELLING GANG
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 9:44 PM IST
Police Arrested Ganja Selling Gang Anantapur District : అనంతపురం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పామిడి పట్టణ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ, "గుంతకల్లు నియోజకవర్గం పామిడి పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ప్రత్యేక టీం లతో ఆ ప్రాంతానికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం.
అలాగే ఒక కారు, రెండు ద్విచక్ర వావానాలు, 5 సెల్ ఫోన్లు, రూ.5000 రుపాయల నగదులు రికవరీ చేసుకున్నాం. ముఠా సభ్యులు వైజాగ్ రూరల్ ఏరియా నుంచి కారు, బస్సుల్లో హోల్ సెల్గా గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా యువతను, గంజాయికి బానిసలైన వారిని టార్గెట్ చేసి విక్రయాలు జరుపుతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తాం" మని సీఐ రాజశేఖర్ తెలిపారు.