గంజాయి నిర్మూలనపై నాదెండ్ల మనోహర్ కఠిన ఆదేశాలు! - janasena nadendla manohar on ganja

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 3:39 PM IST

thumbnail
గంజాయి అణచివేతపై నాదెండ్ల మనోహర్​ ఉక్కుపాదం (ETV Bharat)

Police Arrested 8 Smugglers in Tenali : గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో గంజాయి నిర్మూలనకు కొత్త శాసన సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు.ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లో గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  నాటి వాగ్దానంకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అందులో భాగంగా పోలీసులు ఆదివారం 8మంది గంజాయిని విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్ చేశారు.

గంజాయి విక్రయిస్తున్న బాలాజీ రావు పేటకు చెందిన ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ 40,000 విలువైన రెండు కేజీల గంజాయినీ త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయినీ తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని, త్రీ టౌన్​ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితులను పటుకుని వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారనీ, గంజాయిని విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ యం.రమేష్ హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.