మైనార్టీ యువతిపై లైంగిక వేధింపులు- ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడిపై పోక్సో కేసు - POCSO Case Filed On YSRCP Leader - POCSO CASE FILED ON YSRCP LEADER
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-05-2024/640-480-21399599-thumbnail-16x9-pocso-case-filed-on-ysrcp-leader-in-proddatur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 4:44 PM IST
POCSO Case Filed On YSRCp Leader in Proddatur : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అనుచరుడు దాదాపీర్‌ను ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేశారు. దాదాపీర్ తనను లైగింకంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో యువతి కుటుంబం దాదాపీర్ ఇంట్లో అద్దెకు ఉండేది. యువతికి తండ్రి లేడు. తల్లి ఇళ్లలో పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఎవరూ లేని సమయంలో తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని దాదాపీర్ బెదిరించినట్లు యువతి ఆరోపించారు. ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని యువతి వాపోయారు. చివరకు నిశ్చితార్థం కూడా చెడకొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు మారినా వేధింపులు ఆపలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.