మెగా బ్రదర్స్​తో మోదీ సందడి - PM Narendra Modi - PM NARENDRA MODI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 7:06 PM IST

PM Modi shares warm moment with Chiranjeevi: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ, మరో ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌అను ఆత్మీయంగా పలకరించారు.  

 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అగ్రకథానాయకుడు చిరంజీవి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరుకావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ వెళ్లారు. అక్కడ నుంచి ఉదయం జరిగిన కార్యక్రమానికి వెళ్లారు.  మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ అనంతరం పవన్ కల్యాణ్ మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చంద్రబాబు, మోదీ సభా ప్రాంగణం వద్ద నిల్చొని ఉండగా, పవన్ ఒక్కసారిగా ప్రధాని మోదీ వద్దకు వచ్చారు. తన అన్నయ్యను కల్పించాలనే ప్రయత్నం చేశారు. దానికి మోదీ సైతం ఓకే అన్నట్లుగా చిరు ఉన్నవైపు పవన్ కల్యాణ్​తో పాటుగా వెళ్లారు. అక్కడ చిరును ఆళింగనం చేసుకున్న మోదీ ఇద్దరితో కలిసి ఫోటోలు దిగారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.