LIVE : బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ 'చాయ్ పే చర్చ' - Modi Bill Gates Live - MODI BILL GATES LIVE
🎬 Watch Now: Feature Video
Published : Mar 29, 2024, 9:29 AM IST
|Updated : Mar 29, 2024, 9:44 AM IST
PM Modi Live : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత కొద్దిరోజులుగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన బిల్‌గేట్స్ ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రముఖులతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా గేట్స్ సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఎప్పుడూ స్పూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఇక మరోసారి మోదీ, బిల్‌గేట్స్ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ చాయ్ పే చర్చలో ఈ ఇరువురు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భూగ్రహాన్ని మెరుగుపరిచే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాల గురించి చర్చిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న పెను మార్పులు, వాటి వల్ల ఉపయోగాలు, నష్టాలు వంటి వాటిపైనా మాట్లాడుతున్నారు. మరోవైపు విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ వినియోగంపైన గేట్స్‌తో మోదీ చర్చిస్తున్నారు. జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీ వినియోగించుకున్నామని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అవసరం ఉన్న పేదలకు డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతోందని వివరించారు.
Last Updated : Mar 29, 2024, 9:44 AM IST