పవన్ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము: వర్మ - SVSN Verma met Pawan Kalyan - SVSN VERMA MET PAWAN KALYAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 4:50 PM IST

Pithapuram TDP Incharge Varma met Pawan Kalyan: పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం ఇన్​ఛార్జ్ వర్మ పునరుద్ఘాటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి సుజయ కృష్ణ రంగారావుతో కలిసి పవన్ కల్యాణ్​తో సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను నేతలు పవన్ కల్యాణ్​​కు వివరించారు. పవన్ కల్యాణ్ గారిని భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని నేతలు ఇద్దరూ స్పష్టం చేశారు. త్వరలో తన ప్రచారం పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నట్లు పవన్ కల్యాణ్​ స్పష్టం చేశారు. శ్రీ పురుహూతికదేవి ఆలయంలో పూజలు చేసి, శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకొంటానని పవన్ నేతలకు వివరించారు. అనంతరం వర్మ ఇంటికి వెళ్లిన తరవాత పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతానని తెలిపారు. మూడు పార్టీలు సమన్వయంతో కలసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.