నిద్రమత్తులో వాష్‌రూంకు- రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - One Person Dead Falling Train - ONE PERSON DEAD FALLING TRAIN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 9:00 PM IST
Person Dead Accidentally Falling From Train in Bapatla District : నిద్రమత్తులో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా కొండు బొట్లపాలెంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి అస్సాంకు చెందిన బాబూలాల్ ముర్మా జీవనోపాధి కోసం బెంగుళూరుకు తన బంధువులతో కలిసి రైలులో వెళుతున్నాడు. అర్థరాత్రి సమయంలో నిద్ర మత్తులో వాష్‌రూమ్‌కు వెళుతూ బాబులాల్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడిపోయాడు. ఈ విషయాన్ని మృతుడితో ఉన్న సన్నిహితులు వెల్లడించారు. ఈ ఘటనతో బాబులాల్ తలకు పెద్ద దెబ్బ తగిలినట్లు పోలీసులు తెలిపారు.
దెబ్బ తగిలిన అతనికి ఏం జరుగుతుందో తెలియక అక్కడ నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లినట్లు స్థానికుల సమాచారం. కొండుబట్ల పాలెం వచ్చే సరికి అతను ఒక్కసారిగా పొలాల్లో పడి చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వారి బంధువులను అడిగి తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం రైల్వే పోలీసులు పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.