NEW YEAR RESTRICTIONS IN AP : న్యూ ఇయర్ వేడుకలను ప్రజలంతా ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకునేందుకు వీలుగా విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించటం జరుగుతుందని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాటిని అందరూ పాటించాలని స్పష్టం చేసింది.
- నగరంలోని వేమన మందిరం నుంచి డీఎల్‌ఓ కూడలి వరకు ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై వాహనదారుల భద్రతా దృష్ట్యా ఈ నెల 31న రాత్రి 8 నుంచి జనవరి 1 తెల్లవారుజాము 5 గంటల వరకు పాదచారులకు, వాహనాల రాకపోకలకు అనుమతులు ఉండదు.
- సంపత్ వినాయగర్ దేవాలయం వద్ద జనవరి 1న వాహనాల పూజలు కోసం వచ్చే వారు గోటీ సన్స్ నుంచి కళామందిర్ వరకు రోడ్డుకు ఎడమవైపు వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఒకే వరుసలో పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా రోడ్డుకు కుడివైపున జీవీఎంసీ కమిషనర్ బంగ్లా నుంచి వేమనమందిరం వరకు ఒకే వరుసలో పార్కింగ్ చేసుకోవాలి. ఆలయం ముందు వాహన పూజలకు అనుమతించరు.
- పార్కు హోటల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు బీచ్ రోడ్డులో ఈ నెల 31న రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఎలాంటి వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు అనుమతులు లేవు.
- రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు బీఆర్‌టీఎస్ రహదారి హనుమంతవాక నుంచి అడవివరం కూడలి, గోశాల కూడలి నుంచి వేపగుంట కూడలి, పెందుర్తి కూడలి నుంచి ఎన్‌ఏడీ కూడలి మీదుగా కాన్వెంట్కూడలి మధ్య లైను మూసివేస్తారు. దీంతో సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాహనదారుల భద్రతా దృష్ట్యా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మద్దిలపాలెం కూడలి నుంచి రామాటాకీస్ వరకు ఉన్న బీఆర్‌టీఎస్ రహదారి మధ్యలైను, ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉన్న అండర్‌పాస్ మూసివేయటం జరుగుతుంది.
- ఆర్కేబీచ్‌కు వచ్చే సందర్శకులు తప్పని సరిగా తమ వాహనాలను పార్కింగ్ స్థలాల్లో ఉంచి, కాలినడకన బీచ్‌రోడ్డుకు రావాలి.
- ఆలిండియా రేడియో, సీఆర్ రెడ్డి కూడలి నుంచి వచ్చే వాహనాలు జేసీ బంగ్లా పక్కన ఉన్న ఏపీఐఐసీ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి.
- కోస్టల్ బ్యాటరీ, కలెక్టర్ ఆఫీస్, నౌరోజీ రోడ్డు, పందిమెట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు గోకుల్ పార్కు వద్ద పార్కింగ్ చేసుకోవాలి. అలాగే సిరిపురం పార్కు హోటల్ నుంచి వచ్చే వాహన చోదకులు తమ వాహనాలను ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలోను, పోలీసు ఆఫీసర్ మెస్ వెనుకవైపున పార్కింగ్ చేసుకోవాలి.
- సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నిర్ణీత సమయానికి ముగించాలి.
- మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ నెల 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆల్కోమీటర్లతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
న్యూ ఇయర్ 2025 వేడుకలకు వేళైంది - కానీ షరతులున్నాయి
ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే - న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు