జనం లేక వెలవెలబోయిన జగన్ ఎన్నికల ప్రచార సభ - సీఎం మాట్లాడుతుండగానే ఇంటిబాట - NO PUBLIC TO CM JAGAN MEETING - NO PUBLIC TO CM JAGAN MEETING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 2:15 PM IST

People Not interest CM Jagan Meeting in Mangalagiri Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎం జగన్ మోహన్​ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనం లేక వెలవెలబోయింది. జగన్​ ప్రసంగిస్తుండనేగా మధ్యలో జనం ఇంటిబాట పట్టారు. వారిని ఆపేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సభకు వచ్చిన వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం జగన్​ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో జగన్​ పర్యటిసున్నారు అంటే చాలు అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉంటారు. భద్రత పేరుతో చెట్లను నరికి వేయడం, విద్యుత్​ వైర్లను తొలగించడం, ట్రాఫిక్​ ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితే మంగళగిరి వాసులకు ఎదురైంది. సభ నిర్వహించే ప్రాంతంలో విద్యుత్​ ఆపేయడం వల్ల ఇటు ప్రజలు, అటు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు సైతం మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.