కుదిరినప్పుడే సమస్యలు పరిష్కరిస్తా - స్థానికులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి - YSRCP MLA Kasu Mahesh Reddy - YSRCP MLA KASU MAHESH REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 2:10 PM IST
People Fired on Gurjala YSRCP MLA Kasu Mahesh Reddy in Palnadu District: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. పల్నాడు జిల్లా పల్లెగుంతలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పల్లెగుంత సచివాలయాన్ని అంబాపురానికి ఎందుకు తరలించారని ఈ సందర్భంగా ఆయనను నిలదీశారు.
తమ గ్రామంలో ఉన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని స్థానికులు ప్రశ్నించగా, తనకు కుదిరినప్పుడు పరిష్కరిస్తానంటూ మహేష్ రెడ్డి దురుసు సమాధానం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య మాటా మాటా పెరిగి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అసభ్య పదజాలంతో కాసు మహేష్ రెడ్డి గ్రామస్థులను దూషించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు.