48 గంటల్లో గంజాయిని నియంత్రించవచ్చు- ఆ పని వదిలేసి ప్రతిపక్షాలపై పడ్డారు: పెమ్మసాని - Pemmasani with Medical Employees - PEMMASANI WITH MEDICAL EMPLOYEES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 5:22 PM IST
Pemmasani Chandra Sekhar meeting with Medical Employees : జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధించడానికే పోలీసులను వాడుకుంటోందని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అదే పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రంలో 48 గంటల్లో గంజాయి నియంత్రించవచ్చని అన్నారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో వైద్య సిబ్బందితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూముల ధరలు పెరగడం వల్ల కొత్త ఆసుపత్రుల ఏర్పాటు భారంగా మారిందన్నారు. ఆసుపత్రుల బిల్లులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చంద్రశేఖర్ అన్నారు.
వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన నాణ్యమైన శిక్షణ అందించేలా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చిన్నపిల్లలు కూడా గంజాయి బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విపక్షాలను వేధించడానికి, అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే పోలీసులను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయడం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని ఈ విషయం గుర్తుపెట్టుకొని ఓట్లు వేయాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్ధి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు.