వైఎస్ వివేకా హత్య ప్రధానాంశంగా పులివెందులలో షర్మిల ఎన్నికల ప్రచారం - Sharmila Election Campaign - SHARMILA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-04-2024/640-480-21204621-thumbnail-16x9-sharmila-election.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 11:56 AM IST
PCC President Sharmila Election Campaign in YSR District : కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె నుంచి బస్సుయాత్ర తిరిగి చేపట్టనున్నారు. బస్సు యాత్రలో ఆమెతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పాల్గొననున్నారు. వేంపల్లె నుంచి వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మీదుగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అవినాష్‌రెడ్డి, జగన్‌పై ఘాటైన ఆరోపణలు చేసే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వివేకా హత్య ప్రధానాంశంగా పులివెందులలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో సభను విజయవంతం చేయాలని సునీత దంపతులు గురువారం పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు 14న ఉమ్మడి కర్నూలు జిల్లాలో షర్మిల యాత్ర చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని షర్మిల ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామం ఇచ్చారు.