LIVE: అన్నమయ్య జిల్లాలో 'గ్రామసభ' - పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ - ప్రత్యక్ష ప్రసారం - pawan kalyan in grama sabha

🎬 Watch Now: Feature Video

thumbnail
Pawan Kalyan Participated in Grama Sabha: గ్రామ పంచాయతీలను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామపంచాయతీ (Swarna Grama Panchayat Program) పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నాలుగు అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజున గ్రామసభలు నిర్వహించనున్నారు. సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. రెండో అంశం కింద మురుగు కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘనవ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్‌రోడ్లపై చర్చలు జరుపుతారు. నాలుగో అంశంగా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకంపై చర్చించనున్నారు.గ్రామసభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు నేడు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు, రాజంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థాయి గ్రామసభలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Aug 23, 2024, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.