విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన - దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు - Parents Attack on Teacher in AP - PARENTS ATTACK ON TEACHER IN AP
🎬 Watch Now: Feature Video
Published : Aug 8, 2024, 7:47 PM IST
Teacher Misbehaving with Students : గురువు అంటే తండ్రిలాంటివాడు. విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. అయితే కొందరు గురువులు గాడి తప్పుతూ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. కారంపూడి మోడల్ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
Parents Attack on Teacher in AP : దీంతో మోడల్ స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రవికుమార్‌పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అభ్యంతకరంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్‌ను విధులు నుంచి తొలగించాలని ఆందోళన చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏంఈవో, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.