అవిశ్వాసం వీగడంతో ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన పండిత్ వినీత - Chairperson Pandit Vineeta Pawan
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 5:14 PM IST
Pandit Vinitha Pavan As Armoor Municipal Chairperson : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌పై గత నెల 4వ తేదీన పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో, ఇవాళ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా పండిత్ వినీత పవన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికైన ఆమె, ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు.
Armoor Municipal Chairperson Vinitha Pavan : రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరతానో త్వరలో స్పష్టత ఇస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తను అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. కొంత మంది కౌన్సిలర్లు కావాలని తనపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. తనపై పెట్టిన ఆవిశ్వాస తీర్మానం వీగి నిజాయతీ గెలిచిందని అన్నారు. ఇంకా ఒక సంత్సరంపాటు ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ వినీత పవన్ ఇచ్చారు.