రోడ్డుపై పామాయిల్​ వరద- క్యాన్లు, బిందెలతో ఎగబడ్డ జనం - PALM OIL TANKER OVERTURNED - PALM OIL TANKER OVERTURNED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 11:18 AM IST

Oil Tanker Overturned in Palnadu : అసలే వంట నూనెల ధరలు మండుతున్నాయి. మరీ అలాంటి పరిస్థితిలో ఉచితంగా ఆయిల్ లభిస్తుందంటే ఎవరైనా ఊరుకుంటారా ఎగబడి తీసుకుంటారు. ఇక్కడ కూడా నూనెం కోసం జనం భారీ సంఖ్యలో వచ్చారు. ఇదంతా చూసి ఎవరో పంచుతున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా పడటంతో భారీగా జనం గుమిగూడారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

Palm Oil Tanker Accident Today : పల్నాడు జిల్లాలోని అద్దంకి-నార్కట్​పల్లి రహదారిపై పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు బోల్తా పడ్డ ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ తీసుకెళ్లెందుకు స్థానికులు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు.  దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేశారు. క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.