తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు రుణపడి ఉంటా: కింజరాపు అచ్చెన్నాయుడు - Atchannaidu Congratulate Palla - ATCHANNAIDU CONGRATULATE PALLA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 9:21 AM IST
Atchannaidu Congratulate Palla Srinivas : వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసేలా పార్టీ శ్రేణులు అహర్నిశలు పడ్డ కృషిలో తానూ పాలుపంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరారు. తాను జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. నిరంకుశత్వ, అరాచక, రౌడీ రాజకీయాల నుంచి ఏపీ భవిష్యత్తును, రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న టీడీపీకి, చంద్రబాబుకు, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం పని చేద్దామన్నారు. తనపై నమ్మకంతో కోట్ల మంది రైతులకు సేవ చేసేందుకు అప్పగించిన వ్యవసాయ శాఖను విజయవంతంగా నిర్వహించి దేశంలోనే మంచి పేరు తీసుకొస్తానని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు అచ్చెన్న, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.