YUVA : రైతన్నకు 'డ్రోన్​' సాయం - సాఫ్ట్​వేర్​ ప్రాకేజీలకు తీసిపోని ఆదాయం - drones usage in agriculture - DRONES USAGE IN AGRICULTURE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 4:21 PM IST

Drones Usage in Agriculture : నేటి కాలంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగి, మానవ వనరుల కొరతను అధిగమిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత డ్రోన్‌ సాంకేతికతను వినియోగిస్తూ, కొత్త ఉపాధి మార్గాలకు దారులు వేసుకుంటున్నారు. ఒకరి కింద పని చేయడం ఇష్టం లేకనో, చాలీ చాలనీ జీతాలతో కుటుంబాలను నెట్టుకు రాలేకనో వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. 

సొంతూర్లోనే ఉంటూ ఉపాధి సంపాదించుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలకు ఏ మాత్రం తీసిపోకుండా, సంవత్సరానికి కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉంటూనే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు పాలమూరు జిల్లా యువత. మరి వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? డ్రోన్‌ల ఖర్చు ఎంత? వాటిని ఉపయోగించడానికి ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఆ రైతుల మాటల్లోనే విందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.