రాజ్‌భవన్‌లో 'రామచిలుక' పుస్తకావిష్కరణ - Ramachiluka book launch - RAMACHILUKA BOOK LAUNCH
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 10:35 AM IST
|Updated : Jul 1, 2024, 11:32 AM IST
Ramachiluka book launch : హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం రోజున రామచిలుక పుస్తకాన్ని పద్మశ్రీ కొనకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. నిజజీవిత సంఘటనలు, సన్నివేశాల ఆధారంగా గోవా గవర్నర్ శ్రీధరన్ మలయాళంలో కథల సంకలనాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని రామ చిలుక పేరుతో ఎల్ఆర్ స్వామి తెలుగులోకి అనువదించారు. ఈ నేపథ్యంలో కొనకలూరి ఇనాక్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రగవర్నర్ రాధాకృష్ణన్, ప్రముఖ కవి శివారెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
మానవ జీవితాన్ని చాలా దగ్గరగా చూసి శ్రీధరన్ ఈ కథలు రాశారని వక్తలు పేర్కొన్నారు. చక్కని తెలుగులోకి అనువదించడం అభినందనీయమని కవి శివారెడ్డి అన్నారు. వ్యవస్థల విధ్వంసం, చట్టం, రాజ్యాంగం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చాలా విషయాలు పుస్తకాల్లో రాశానని మూల రచయిత, గోవా గవర్నర్ శ్రీధరన్ అన్నారు. నేటి సమాజ పరిస్థితులూ, సమస్యలకు పరిష్కారాలను కథల్లోని పాత్రల ద్వారా చెప్పించారని కొనకలూరి ఇనాక్ తెలిపారు. ఈ పుస్తకంలో అనేక విషయాలను రచయిత చర్చించారని వక్తలు వెల్లడించారు. పాఠకుడికి అర్థం అయ్యే విధంగా తెలుగులో ఈ పుస్తం అనువదించారని, ఈ కథల సంపుటిని అందరు చదవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.