Live : దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం - Padma Awards Ceremony Live - PADMA AWARDS CEREMONY LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 9, 2024, 6:44 PM IST
|Updated : May 9, 2024, 7:08 PM IST
Padma Awards Ceremony in Delhi Live : గణతంత్య్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన 'పద్మ' పురస్కరాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి. ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్ స్వామి, కమలేష్ డి.పటేల్‌లను పద్మభూషణ్ పురస్కారాలు వరించగా, ఎం.ఎం.కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డులు అందుకున్నారు. కాగా మిగిలిన వారికి ఇవాళ దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 9, 2024, 7:08 PM IST