ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐపై రామోజీ ఫిల్మ్​ సిటీలో అవగాహన కార్యక్రమం - Celebrations of ESIC and EPFO - CELEBRATIONS OF ESIC AND EPFO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 7:37 PM IST

One Year Celebrations of ESIC and EPFO in Ramoji Film City : ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం, అధికారులతో సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా 'నిధి ఆప్కే నికత్‌ 2 పాయింట్‌ ఓ పేరిట ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, ఈఎస్‌ఐసీ సంయుక్తంగా రామోజీఫిల్మ్‌సిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులు, వాటాదారుల సందేహాలు, సమస్యలపై అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ESIC and EPFO Celebrations : ప్రయాస్‌, పెన్షన్‌ ఆన్‌ డ్యూ బేసెస్‌ అనే రెండు కార్యక్రమాల ద్వారా ఖాతాదారులకు సేవలందిస్తున్నట్లు బర్కత్‌పురాలోని ప్రాంతీయ భవిష్యనిధి సంస్థ కమిషనర్‌ శివకుమార్‌ పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే నెలలో పెన్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని భవిష్యనిధి సంస్థ సహాయ కమిషనర్‌ జి. రామ్మోహన్‌ అన్నారు. ఈ కార్యక్రమలో ఈఎస్​ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్‌తో పాటు ఈపీఎఫ్​ఓ, ఈఎస్​ఐసీ ఉద్యోగులు, రామోజీ గ్రూప్‌ సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.