గొయ్యిలో పాతిపెట్టిన రూ.2 లక్షలు లేవంటూ వృద్ధురాలు ఫిర్యాదు - వెతికి అప్పగించిన పోలీసులు - A old Woman Buried Two Lakhs in pit
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 5:29 PM IST
Old Woman Buried RS.2 Lakhs in Pit : గొయ్యిలో పాతి పెట్టిన రూ.2 లక్షలు కనిపించడంలేదంటూ ఓ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటి ఆవరణలో డబ్బులను వెతికి ఆ నగదును వృద్ధురాలికి అప్పగించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ అనే వృద్ధురాలు చిన్న కిరాణం దుకాణం నడిపిస్తూ జీవవం సాగిస్తోంది. ఆమె సంపాదించిన రెండు లక్షల రూపాయలు చోరీకి గురికాకుండా భద్రంగా తన ఇంట్లో గొయ్యి తీసి పాతిపెట్టింది.
Money Buried in pit at Bayyaram : ఈ క్రమంలో రంగమ్మ తన బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాగా డబ్బులు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే బయ్యారం పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని, పరిసర ప్రాంతాల్లో వెతకగా మట్టిలో పాతిపెట్టిన రూ.2 లక్షలు దొరికాయి. ఆ నగదును స్థానిక ఎంపీటీసీ కుమారి, సర్పంచ్ రమేశ్ సమక్షంలో పోలీసులు వృద్ధురాలికి అందజేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు బ్యాంకులో దాచుకోవాలని ఎస్సై ఉపేందర్ రావు వృద్ధురాలిని సూచించారు.