దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కూప్పకూలిన 73ఏళ్ల వ్యక్తి- మృతి - Old Man Dies While Dancing

🎬 Watch Now: Feature Video

thumbnail

Old Man Dies While Dancing : యోగా శిబిరంలో దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలారు ఓ 73ఏళ్ల వృద్ధుడు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి.  

ఇదీ జరిగింది
ఇందౌర్​లోని ఫూటీ ఖోటీ ప్రాంతంలో జరిగిన యోగా శిబిరానికి కొంతమందితో కలిసి ప్రదర్శన కోసం వచ్చారు బల్వీర్ సింగ్ ఛబ్రా అనే వ్యక్తి. అనంతరం సైనికుల కాస్ట్యూమ్​ ధరించి దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో స్టేజీ మీదకు ఎక్కి కింద పడిపోయారు. అయితే అక్కడ ఉన్నవారు మొదటి ప్రదర్శనలో భాగంగానే బల్వీర్​ సింగ్ పడిపోయాడని భావించారు. ఎంతసేపయినా లేవకపోవడం వల్ల సీపీఆర్​ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఈసీజీ, ఇతర పరీక్షలు చేసిన తర్వాత బల్వీర్​ సింగ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బల్వీర్​ కొన్నేళ్లుగా దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు అతడి కుమారుడు బగ్జీత్​ సింగ్ తెలిపారు. బల్వీర్​ కళ్లు, చర్మాన్ని దానం చేసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.