ETV Bharat / state

నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే - ఇల్లొదిలి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇలా చేస్తే సరిపోతుంది - SAMAGRA KUTUMBA SURVEY 2024

నేటి నుంచి రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం - కుటుంబ వ్యక్తిగత వివరాలను సేకరించనున్న గణకులు (ఎన్యూమరేటర్లు)

Samagra kutumba survey In Telangana
Samagra kutumba survey 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 7:23 AM IST

Samagra kutumba survey In Telangana 2024 : తెలంగాణలో రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే నేటి (శనివారం) నుంచి జరగనుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను గణకులు (ఎన్యూమరేటర్లు) సేకరిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి దూర ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే, అక్కడే గణకుల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం ఇచ్చింది.

ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, స్వగ్రామానికి వెళ్తేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ పడవద్దని రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. సర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధార్, సెల్​ఫోన్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలి. ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన గణకులకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.

ఈ నెల 6వ తేదీ నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు సర్వే పూర్తి చేశారు. ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదుకు బుధ, గురు, శుక్రవారాల వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇంకా పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇళ్లు మిగిలి ఉన్నాయి. వాటి వివరాల నమోదు శనివారం పూర్తి చేస్తారు. వీటి ఆధారంగా ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని సభ్యులందరికి సంబంధించిన వివరాల నమోదును నేటి నుంచి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, అన్ని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ వివరించింది. హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉన్నాయి. వీటిని 19,328 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించారు. సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది గణకులను, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను, ప్రభుత్వం నియమించింది.

ఏ కులమూ లేదంటే 999 కోడ్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కుటుంబాల వివరాల నమోదు కోసం ఇది వరకు ఖరారు చేసిన ఫామ్​లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. కులం వివరాలు చెప్పకుంటే 999, ఏ సామాజికవర్గం లేదంటే 01 కోడ్‌లతో నమోదు చేసేలా మార్చారు. ధరణిలోని భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కొన్ని వరుసలను చేర్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు ఎలాంటి వివక్ష, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా వెళుతున్నారా? లేదా’ అనే అంశాన్ని సైతం కొత్తగా ఫామ్​లో చేర్చారు.

రాజ్‌భవన్‌ వద్ద సర్వే స్టిక్కర్‌ : సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌ కుటుంబ వివరాల నమోదు కోసం రాజ్‌భవన్‌ గేటు వద్ద ఎన్యూమరేటర్లు శుక్రవారం స్టిక్కర్‌ అతికించారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేరుతో స్టిక్కర్‌ అతికించినట్లు అధికారులు తెలియజేశారు.

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆ పత్రాలు అడిగితే ఇచ్చేస్తున్నారా? - అయ్యో.. అలా ఇవ్వకూడదండి

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.