పింఛను కోసం వచ్చి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడు - OldManCame Pension Fell Unconscious - OLDMANCAME PENSION FELL UNCONSCIOUS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 2:09 PM IST
Old Man Came For Pension Fell Unconscious in Challapalli: కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో సచివాలయ పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు పింఛన్ కోసం తన ఇంటి వద్ద నుంచి గ్రామ సచివాలయానికి వెళ్తుండగా స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయాడు. వెంటనే అతడిని గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. వృద్ధుడిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, మహిళలు గ్రామ సచివాలయాల వద్ద నిరీక్షిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పంపిణీ చేస్తామని చెప్పడంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. సచివాలయాల వద్ద తగిన సమాచారం ఇచ్చే సిబ్బంది అందుబాటులో లేక పెన్షన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఎండ తీవ్రంగా ఉన్నా కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో పింఛను కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఉదయం 8 గంటలకు సచివాలయాలు వద్ద పెన్షన్ తీసుకునేందుకు రావాలని ప్రకటించడంతో ఉదయం 7 గంటలకే భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే పెన్షన్ ఇచ్చేందుకు సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పింఛను డబ్బులను ఇంకా బ్యాంకులో జమ చేయకపోవడంతో ఆశతో వచ్చిన వృద్ధులు, మహిళలు నిరాశగా వెనక్కి వెళ్లిపోతున్నారు.