ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్స్ 55వ వార్షికోత్సవాలు- గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం - NTR Cultural Association Live - NTR CULTURAL ASSOCIATION LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 7:28 PM IST
|Updated : Aug 25, 2024, 9:11 PM IST
55 Years Celebrations NTR Cultural Association in Guntur : సినీనటుల మీద అభిమానం సహజం. ఆ అభిమానం 5 దశాబ్దాలుగా కొనసాగుతూ, అదే అభిమానం సేవా కార్యక్రమాల వైపు మళ్లటం సామాన్యం విషయం కాదు. గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కల్చరల్ అసోషియేషన్ అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌కు అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నా వాటిలో ఈ సాంస్కృతిక సంఘం ఎంతో ప్రత్యేకం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ నటనను, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి అయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో వేడుక నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉన్నప్పుడే కాకుండా సీఎం అయిన తర్వాత కూడా రైలుపేట అసోషియేషన్ సభ్యులు కలవడానికి వెళితే ఎంతో అభిమానం చూపేవారు. ఆయన సాధారణంగా ఆదివారం కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులకు కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ రైలుపేట అభిమాన సంఘానికి మాత్రం ఆదివారం కూడా ఎన్నోసార్లు ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
Last Updated : Aug 25, 2024, 9:11 PM IST