ధర్మవరంలో దారుణం- ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి హతం - NSUI leader MURDER - NSUI LEADER MURDER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 12:22 PM IST

NSUI National Secretary Sampathraju Brutally Murdered: సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు వద్ద ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి సంపత్‌రాజు దారుణ హత్యకు గురయ్యాడు. రహదారి పక్కనే సంపత్‌రాజును గుర్తుతెలియని వ్యక్తులు కొడవలితో నరికి చంపేసి పడేసిపోగా మృతదేహాన్ని చూసి వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడిని ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు

హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. హంతకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సంపత్‌రాజును హత్య చేయడానికి భూతగాదాలే కారణమా లేకుంటే ఇతర వ్యక్తులతో ఏమైనా తగాదాలు ఉన్నాయా అని స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్య చేసింది ఎవరో అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.