ప్రియా ఫుడ్స్ ఉత్పత్తులు బాగున్నాయి: ఎన్ఎస్ఎస్ఓ బృందం
🎬 Watch Now: Feature Video
NSSO Team Visited Priya Foods Office And Products Unit: కృష్ణా జిల్లా పోరంకిలోని ప్రియా ఫుడ్స్ కార్యాలయం (Priya Foods Office), ఉత్పత్తుల యూనిట్‌ను జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (National Sample Survey Organisation) ఉన్నత అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. ఇక్కడ తయారవుతున్న ఆహార ఉత్పత్తులు, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లు, ఉపాధి అవకాశాలు, సదుపాయాలు, పరిశుభ్రత, సౌకర్యాలు, ఇతర విభాగాలను అడిషనల్ డైరెక్టర్ జనరల్ మాలిక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ కుమార్ పరిశీలించారు.
Nsso Team Compliment To Priya Foods: ఉత్పత్తుల తయారీ విధానాలతో పాటు ఇతర అంశాలను ప్రియా ఫుడ్స్ జనరల్ మేనేజర్ ఆర్ఎన్ ప్రసాద్ వారికి వివరించారు. ఆధునిక పరికరాలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉత్పత్తుల తయారీ విధానాలు బాగున్నాయని ప్రియాఫుడ్స్ అధికారులు, సిబ్బందిని మాలిక్ అభినందించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై తమ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందన్నారు.