ఏపీలో పాలన, పరిణామాలు చూసి అమెరికాలో ఎంతో ఆవేదన చెందుతున్నాం: ఎన్నారై - NRIS FIRE ON JAGAN REGIME - NRIS FIRE ON JAGAN REGIME
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 11:24 AM IST
NRI Doctors With ETV Bharat Interview: ప్రజాస్వామ్య పాలనలో ఓటు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రవాసాంధ్రులు సైతం రాష్ట్రానికి తరలివస్తున్నారు. అమెరికాలో సైతం రాష్ట్రాలకు రాజధాని ఒక్కటే ఉంటుందని వైద్య దంపతులు తేజానంద్ గౌతమ్, విజయ తెలిపారు. ఏపీలో పాలన, పరిణామాలు చూసి అమెరికాలో ఉన్న తెలుగువారు ఎంతో ఆవేదన చెందుతున్నారని ప్రవాసాంధ్ర వైద్య దంపతులు తేజానంద్, విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, భరోసా కల్పించే ప్రభుత్వాలనే ఎక్కడైనా ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో వ్యవసాయ రంగంలో అన్నపూర్ణగా పేరు పొందిందన్నారు. రైతులు, కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని తేజానంద్ అన్నారు. మానవ వనరులు అధికంగా ఏపీలో ఉండటం అదృష్టమన్నారు. ఎవరు యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వగలరు, ఏ నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం మెరుగవుతుందో అలాంటి వారినే గెలిపించుకోవాలని తేజానంద్ సూచించారు. విద్య, వైద్యం ఈ రెండింటిని అభివృద్ధి చేయాలని వైద్యురాలు విజయ అన్నారు.